మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:53:53

ఆన్‌లైన్‌లో రాములోరి తలంబ్రాలు

ఆన్‌లైన్‌లో రాములోరి తలంబ్రాలు

-దేవాదాయశాఖ మంత్రి అల్లోల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీరామ నవమి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించ వద్దని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలపై శనివారం ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున భద్రాద్రిలో స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు. శ్రీరామనవమి వేడుకలను ఆలయం ప్రాంగణంలోనే నిర్వహిస్తామని, భక్తులెవరికీ అనుమతిలేదని స్పష్టంచేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొన్నవారికి స్వామి తలంబ్రాలను పంపిస్తామన్నారు. సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని సూచించారు. ఉగాదిని పురస్కరించుకొని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సుదర్శన, మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 


logo
>>>>>>