శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 03:00:02

విద్యాప్రమాణాలు పడిపోకుండా చర్యలు

విద్యాప్రమాణాలు పడిపోకుండా చర్యలు

  • దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సోన్‌: విద్యాప్రమాణాలు పడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతోపాటు యూనిఫారాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరవడం కష్టంగా ఉన్నదని, విద్యార్థులు ఇంటి వద్ద చదువుకోవడానికి వీలుగా ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తున్నదని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 


logo