ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 19:20:25

ఐదో వ్యక్తికి కరోనా పాజిటివ్‌

ఐదో వ్యక్తికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: ఇండోనేషియా దేశానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు గర్తించారు. అతడిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పతికి తరలించారు. ఇప్పటికే మొదట కరోనా పాజిటివ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి డిశ్చార్జ్‌ కాగా, ఇటలీ నుంచి వచ్చిన ఖమ్మం యువతి, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన, స్కాట్‌లాండ్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. వారికి చికిత్స అందిస్తున్నామని అందరూ త్వరలోనే కోలుకుంటారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. 

కరోనా వైరస్ పై ఆందోళన కలిగించే వార్తలు రాసి దుష్ప్రచారం చేయకండి. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ప్రజలు ఎక్కువ మంది ఉన్న పబ్లిక్ ప్లేస్ లలో తిరగపోవడం ఉత్తమం..ఎవరికీ వారు శుభ్రత పాటించి ఇతర వ్యక్తులకు దూరంగా ఉంటే ఈ వ్యాధిని త్వరగా అరికట్టవచ్చని సూచించారు.  


logo