శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 12:14:40

శంషాబాద్‌లో కారు ప్ర‌మాదం.. ఇండిగో పైల‌ట్ మృతి

శంషాబాద్‌లో కారు ప్ర‌మాదం.. ఇండిగో పైల‌ట్ మృతి

హైద‌రాబాద్‌: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైల‌ట్‌గా ప‌నిచేస్తున్న ప్రీత్ మ‌హేంద‌ర్ సింగ్ కారు ప్ర‌మాదంలో మృతిచెందాడు.  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌కు కారులో వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.  డ్యూటీ చేసేందుకు ట్యాక్సీలో వ‌స్తున్న  మ‌హేంద‌ర్ సింగ్ వాహ‌నం.. ముందు వెళ్తున్న కాంటేన‌ర్ ట్ర‌క్కును ఢీకొట్టింది.  ఉద‌యం 5 గంట‌ల ప్రాంతంలో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు రాజేంద్ర న‌గ‌ర్ పోలీసులు తెలిపారు. పైల‌ట్ మ‌హేంద‌ర్ సింగ్ ఐటీ కారిడార్‌లో నివాసం ఉంటున్న‌ట్లు తెలిపారు.  హిమాయ‌త్‌సాగ‌ర్ దాటిన త‌ర్వాత ట్యాక్సీ డ్రైవ‌ర్ శివ‌శంక‌ర్ ముందు వెళ్తున్న ట్ర‌క్కు వేగాన్ని అంచ‌నా వేయ‌లేక‌పోయాడ‌ని ఇన్‌స్పెక్ట‌ర్ జీ సురేశ్ తెలిపారు.  డ్రైవ‌ర్ ప‌క్క‌న కూర్చున్న సింగ్‌.. తీవ్రగాయాల‌తో చ‌నిపోయాడు.  304-ఏ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశారు.  


logo