హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ రాజధాని మాలేకు ఇండిగో విమాన సంస్థ తమ విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడుసార్లు విమానాలు నడపనున్నట్లు ఇండిగో తెలిపింది. మంగళవారం, గురువారం, ఆదివారం హైదరాబాద్ నుంచి మాలేకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి వారానికి నాలుగుసార్లు సర్వీసులను నడిపేందుకు యోచిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.