బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:13:31

మనుషులపై పరీక్షలు మొదలెట్టిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డీ

మనుషులపై పరీక్షలు మొదలెట్టిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డీ

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ కోసం మానవ పరీక్షలను ప్రారంభించినట్లు భారత ఔషధ సంస్థ జైడస్ కాడిల్లా బుధవారం వెల్లడించింది. జైడస్ కాడిల్లా తన మానవ పరీక్షల్లో భాగంగా 1000 మందికి పైగా పాల్గొంటుననారు. ఇందుకోసం దేశంలో అనేక క్లినికల్ రీసెర్చ్ సెంటర్లను స్థాపించారు.

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ గురించి ఈ రోజుల్లో చాలా చర్చ జరుగుతున్నది. అన్నీ సక్రమంగా జరిగితే కొద్ది రోజుల్లోనే కొవిడ్ వ్యాక్సిన్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. భారత్ మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ తరువాత.. ఇప్పుడు దేశంలో రెండవ కరోనా వ్యాక్సిన్ నిమిత్తం మానవ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ అయిన జైకోవ్-డీ ని సురక్షితంగా భావిస్తున్నట్లు జైడస్ కాడిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. దీనికి ముందు.. ఈ కరోనా వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ రోగనిరోధక శక్తి పరీక్షల మంచి ఫలితాలను చూపించాయని వారు తెలిపారు.  ఈ వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించారని వారు చెప్పారు. 

జైడస్ కాడిల్లా హెల్త్‌కేర్ లిమిటెడ్ సంస్థ.. హైదరాబాద్ కు చెందిన ఔషధ తయారీ సంస్థ. అంతకుముందు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు కూడా ఇటువంటి ప్రయత్నాలకు డీసీజీఐ అనుమతించింది.

ఆగస్టు 15 న వచ్చే అవకాశాలు

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆగస్టు 15 న కరోనా దేశీయ వ్యాక్సిన్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. భారత్ బయోటెక్ భాగస్వామ్యంతో ఐసీఎంఆర్ తయారుచేసిన ఈ టీకా జంతువులపై విజయవంతమైంది. ప్రస్తుతం మానవులపై పరీక్షలు జరుపుతున్నారు. నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు పూర్తిచేసి ఆగస్టు 15 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిసింది.


logo