గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 01:24:39

లండన్‌లోభారత విద్యార్థుల అవస్థలు

లండన్‌లోభారత విద్యార్థుల అవస్థలు

  • కేంద్రం చొరవ తీసుకోవాలి: అసద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లండన్‌లో భారతీయ విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన 70 మంది లండన్‌ గ్యాట్‌విక్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిలిచిపోయారన్నారు. వారు ఇండియాకు రావడానికి అక్కడి విమానాశ్రయ అధికారులు అనుమతినివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వారిని భారత్‌కు రప్పించాలని కోరారు.


logo