గురువారం 02 జూలై 2020
Telangana - Jun 01, 2020 , 08:18:02

రైళ్లు షురూ..తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో శ్రీకారం

రైళ్లు షురూ..తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో శ్రీకారం

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా నిలిచిపోయిన  ప్రయాణికుల రైళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు 8 రోజువారీ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌(హైదరాబాద్‌-న్యూఢిల్లీ)తో రైళ్ల పునః ప్రయాణం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 6.25 గంటలకు నాంపల్లి స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరింది.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్లలో ఫుడ్‌కోర్టులు, షాపులు తెరుచుకున్నాయి.   కరోనా వ్యాప్తి  నేపథ్యంలో ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి సుమారు గంటన్నర ముందే స్టేషన్‌కు రావాలని, అందరూ మాస్క్‌లు ధరించాలని కోరింది. తెలంగాణ, హుస్సేన్‌ సాగర్‌, ఫలక్‌నుమా, గోదావరి, రాయలసీమ, ధానాపూర్‌, గోల్కొండ, సచ్‌కండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మొదటి దశలో పునరుద్ధరించారు. logo