బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 01:33:53

పరిమితస్థాయిలో పోస్టల్‌ సేవలు

పరిమితస్థాయిలో పోస్టల్‌ సేవలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోస్టాఫీసులు బుధవారం నుంచి పరిమిత స్థాయిలో సేవలందించనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాల పార్సిళ్లను ఎవాల్యూయేషన్‌ సెంటర్లకు  బట్వాడాచేయడంతోపాటు స్పీడ్‌ పోస్టు, రిజిస్ట్రేషన్‌ పోస్టు, మనియార్డర్‌ సేవలు అందించనున్నాయి. వీటితోపాటు పొదుపు డిపాజిట్లు, నగదు ఉపసంహరణ సేవలు కూడా అందించనున్నట్టు తపాలాశాఖ తెలిపింది. ప్రస్తుతం రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించినందున సేవల అందజేతలో కొంత ఆలస్యం జరుగవచ్చని పేర్కొన్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 37 హెడ్‌ పోస్టాఫీసులతోపాటు హైదరాబాద్‌ జీపీఓలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపింది.

 పద్మారావునగర్‌, గోల్కొండ, గోల్కోండ చౌరస్తా, గాంధీనగర్‌, జమిస్తాన్‌పూర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్‌, కుల్సుంపుర, కార్వాన్‌, టోలిచౌకి, మెహదీపట్నం ప్రాంతాల్లో మూడు మొబైల్‌ వ్యాన్ల ద్వారా మనియార్డర్లు, డిపాజిట్లు, నగదు ఉపసంహరణ సేవలందిస్తున్నట్టు వివరించింది. మెయిల్‌ మోటర్స్‌ సర్వీసెస్‌ వెహికల్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకొని 33 జిల్లాలోని పీహెచ్‌సీలకు సర్జికల్‌ ఐటమ్స్‌, లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్స్‌, స్లైన్‌ బాటిల్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను అందిస్తామని, ఇందుకోసం 20 వాహనాలను సిద్ధంచేశామని తపాలాశాఖ తెలిపింది.


logo