హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మార్కెట్లోకి తేలికైన సిలిండర్‌ను ప్రవేశపెట్టింది. బుల్లెట్‌ఫ్రూఫ్ ఫైబర్‌తో తయారైన ఈ సిలిండర్లు 5, 10 కిలోల వేరియంట్లలో లభిస్తాయి. లోహంతో తయారుచేసిన సిలిండర్లతో పోలిస్తే ఇవి తక్కువ బరువుతో, సౌకర్యంగా ఉంటాయని, చిలుము, మరకల సమ స్య ఉండదని ఐవోసీ ప్రతినిధి రాధిక మీడియాకు చెప్పారు. పదికిలోల సిలిండర్ ధర రూ.659.50 ఉంటుంది.