గురువారం 04 జూన్ 2020
Telangana - May 03, 2020 , 10:43:53

గాంధీ వైద్య సిబ్బందిపై పూలవర్షం

గాంధీ వైద్య సిబ్బందిపై పూలవర్షం

హైదరాబాద్‌ : కరోనా పోరాట యోధులకు త్రివిధ దళాలు నేడు వందన సమర్పణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిపై భారత వాయు సేన పూల వర్షం కురిపించింది. ఆస్పత్రి ఆవరణలోని ప్రొ.జయశంకర్‌ విగ్రహం వద్ద వైద్య సిబ్బంది భౌతికదూరాన్ని పాటిస్తూ నిలుచున్నారు. హైదరాబాద్‌ సీపీతో పాటు ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు గాంధీ ఆస్పత్రి వద్ద క్యూలో నిల్చున్నారు. వీరి సేవలకు సంఘీభావంగా వాయుసేన హెలికాఫ్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించింది. దీనిపై డాక్టర్లు, నర్సులు, పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.logo