శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 19:36:45

నిరాడంబ‌రంగా చింపాంజీ సుజీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్

నిరాడంబ‌రంగా చింపాంజీ సుజీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్

హైద‌రాబాద్ : దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన చింపాంజీలలో ఒకటైన సుజీ అనే చింపాంజీ పుట్టిన రోజు వేడుక‌లు హైద‌రాబాద్ జూపార్కులో నిరాడంబ‌రంగా జ‌రిగాయి. సుజీకి 34 ఏళ్లు నిండ‌డంతో ఆమె బ‌ర్త్ డే వేడుక‌లు జూ సిబ్బంది నిర్వ‌హించారు. 

క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా సుజీ పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఎవ‌రూ హాజ‌రు కాలేదు. కేవ‌లం జూపార్కు సిబ్బంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. గ‌తంలో జూకు వ‌చ్చిన సంద‌ర్శ‌కుల మ‌ధ్య బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ చేసేవారు. సుజీకి ఇష్ట‌మైన ఫ్రూట్ కేక్ ను త‌యారు చేసి క‌ట్ చేశారు. ఆ త‌ర్వాత కేక్ ను, రొట్టెల‌ను సుజీకి అందించారు. ఈ చింపాంజీ ఉండే ప్ర‌దేశాన్ని వివిధ ర‌కాల పండ్లు, కూర‌గాయ‌ల‌తో అలంక‌రించారు. దీంతో సుజీ కాసేపు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసింది. 

సుజీని 2011 లో సహారా గ్రూప్.. నెహ్రూ జూలాజికల్ పార్కుకు బహుమతిగా ఇచ్చింది. ముఖ్యంగా యువ సందర్శకులు, పాఠశాల విద్యార్థులు.. సుజీని చేసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సుజీ బ‌ర్త్ డే వేడుక‌ల్లో జూ క్యురేటర్ ఎన్ క్షితిజ‌, డిప్యూటీ క్యురేట‌ర్ ఏ నాగ‌మ‌ణి, అసిస్టెంట్ క్యురేట‌ర్ స‌తీష్ బాబు, డిప్యూటీ రేంజ్ ఆఫీస‌ర్ అనిత‌తో పాటు ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.


logo