సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 10:14:12

67లక్షలకు చేరువలో కరోనా కేసులు

67లక్షలకు చేరువలో కరోనా కేసులు

హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24గంటల్లో 61,267 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరో 884 మంది వైరస్‌ ప్రభావంతో మరణించారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,85,083కు చేరాయి. ప్రస్తుతం 9,19,023 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 56,62,491 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా 1,03,569 మంది మృత్యువాతపడ్డారని మంత్రిత్వశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 10,89,403 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం 8,10,71,797 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo