శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 10:40:25

దేశంలో కొత్త‌గా 9,102 క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 9,102 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,102 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి 15,901 మంది కోలుకోగా, 117 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 1,06,76.838 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,77,266 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 1,03,45,985 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 1,53,587కు చేరింది. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20,23,809 మంది టీకా తీసుకున్నారు.

VIDEOS

logo