శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 16:38:08

ఇండియా లాక్‌డౌన్‌.. ఇండ్లలో ఇలా గడపండి

ఇండియా లాక్‌డౌన్‌.. ఇండ్లలో ఇలా గడపండి

కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించారు.  ఈ దిగ్బంధం మనల్ని కేవలం  వైరస్ బారీ నుంచి కాపాడడం మాత్రమే కాదు , ప్రతీ ఒక్కరిలో అనేక ఆలోచనలను సృష్టిస్తూ... వ్యక్తిగత, కుటుంబ, సామాజిక  భాద్యతలను గుర్తు చేస్తూ వాటిని మన వాళ్ళతో పంచుకునేలా చేస్తుంది.

మొన్నటి వరకూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కుటుంబంలో చిన్న పిల్లల నుంచి వయో వృద్ధుల వరకూ  ఎవరి హడావిడి వారిదే..ఎవరి దారి వారిదే...  చదువులు, ఉద్యోగాల బిజీ లో ఒకరినొకరు పలుకరించుకోవడమే కష్టం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ కర్ఫ్యూ తో పరిస్థితులు మారిపోయాయి.   అరుదైన ఈ దిగ్బంధనాన్ని మనకు అనువుగా మార్చుకుంటే పెద్దలకు,పిల్లల కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది..

- కుటుంబ సభ్యుల మధ్య ఏ స్థాయిలో మనస్పర్థలు ఉన్నా సరే లాక్ డౌన్ ముగిసే వరకూ అందరూ కలిసే ఉండాలి...ఉండి తీరాలి.  అందుకే అలకలు, కోపతాపాలను దిగ్బంధనం చేసే దిశగా ఆలోచనలు చేస్తే, మనం బయటికి వచ్చే నాటికి ఇంట్లో ఉన్న "కర్ఫ్యూ" కి స్వస్తి చెప్పడం పెద్ద పని కాదు.. 

- ఇంతకాలం పిల్లలతో ఏదో రూపంలో ఇబ్బందులు పడుతున్న తల్లిదండరులందరూ కొంచెం ఆలోచనలకు పదును పెడితే మీ బంగారాలను సమాజంలో మెరికల్లా మార్చవచ్చు..... పుస్తకాలు, తరగతి గదులకే పరిమితం అవుతున్న నేటి పిల్లలకు కుటుంబ, సామాజిక సమస్యలు, బాధ్యతల పట్ల అవగాహన తక్కువగా ఉంటున్నది. ఇంట్లో తల్లిదడ్రులతో పాటు, వయో వృద్ధులు తమ అనుభవాలను చెప్తూ, భవిష్యత్ గురించి కాస్త వివరంగా చెప్పలిగితే చాలు... ప్రభుత్వపు 3 వారాల క్వారంటైన్ మీ పిల్లలకు ఎలాంటి మేలు చేసిందో ముందు రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది.

- చాలా మంది పిల్లలు సబ్జెక్టుల్లో తప్ప జనరల్ నాలెడ్జిలో వెనుకబడి ఉంటున్నారు.. ఆ లోటు ప్రభావం పోటీ పరీక్షల్లో  వారి జీవితాలపై పడుతుంది...  వారి భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తుంది .  9 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు జనరల్ నాలెడ్జ్ ప్రాముఖ్యతను ఉదాహరణల తో చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు బోర్ గా ఫీలవ్వరు. సమయాన్ని వృధా కానీయ కుండా సద్వినియోగం చేసుకోవచ్చు.

 - పెద్దవాళ్ళ ప్రవర్తన ప్రభావం పిల్లలపై పడుతుంది. ఇదే పిల్లల్లో మొండితనాన్ని పెంచేలా చేస్తుంది.. అందుకే ఈ కరోనా దిగ్బంధం ముగిసే నాటికైన "మనలో లోపాలు - పిల్లలపై వాటి ప్రభావాల"పై దృష్టి పెట్టండి.. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. స్కూల్ సిలబస్ ను పూర్తి చేసే ప్రయత్నం లోభాగంగా పిల్లలకు పాఠాలు చెప్పాలి.


logo