మంగళవారం 14 జూలై 2020
Telangana - May 26, 2020 , 18:06:57

పట్టణీకరణతోనే తెలంగాణలో వానలు

పట్టణీకరణతోనే తెలంగాణలో వానలు

హైదరాబాద్‌: నానాటికి పెరుగుతున్న పట్టణీకరణ కారణంగానే తెలంగాణతోపాటు తమిళనాడు, కేరళలో వర్షాలు ఎక్కువగా కురుస్తాన్నయని హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. తమ అధ్యయనం ఫలితాలను యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఈ వర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌, ఓషన్‌ అండ్‌ అట్మాస్ఫియర్‌ సైన్సెస్‌ విభాగం ప్రొఫెసర్‌ కరుమూరి అశోక్‌ నేతృత్వంలోని బృందం.. ఈ మూడు రాష్ట్రాల్లో మారుతున్న భూ వినియోగం, భారీ వర్షపాతం నమోదు వంటి సాధారణ అంశాలపై పరిశోధనలు గావించారు. ఈ అధ్యయనం ఫలితాలను క్వార్టర్లీ జర్నల్‌ ఆఫ్‌ రాయల్‌ మెటీరోలాజికల్‌ సొసైటీలో ప్రచురితమైంది.

దక్షిణ భారతదేశంలోని నగరాల్లో 2015 డిసెంబర్‌ నెలలో చెన్నైతోపాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 2016 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంత్లాలో.. అలాగే 2018 ఆగస్టు నెలలో కేరళలో కూడా విపరీతమైన వానలు పడ్డాయి. ఈ మూడు రాష్ట్రాలు భౌగోళికంగా విభిన్నంగా ఉండటమే కాకుండా విభిన్నంగా వర్షాలు కురుస్తున్నాయి. 

ఈ రాష్ట్రాల్లో భారీ వర్షపాతం సంభవించే అవపాతం 2000 నుంచి 2017 వరకు గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనం తేల్చింది. ఇస్రో నుంచి భూమి వినియోగానికి సంబంధించిన డేటాను సేకరించి.. ఈ మూడు రాష్ట్రాల్లో 12 భారీ వర్షాల యొక్క 2 కిలోమీటర్ల రిజల్యూషన్‌ సిమ్యులేషన్‌ ప్రయోగాలు చేయడం ద్వారా భూ వినియోగంలో మార్పులను కనుగొన్నారు. ఇది అధిక ఉపరితల ఉష్ణోగ్రతలు, లోతైన మరియు తేమతో కూడిన సరిహద్దు పొరకు దారితీసిందని, తద్వారా సాపేక్షంగా అధిక ఉష్ణ ప్రసరణ లభ్యమయ్యే శక్తిని కలిగించడం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడులో పట్టణీకరణ పెరుగడం వలన 20 నుంచి 25 శాతం అధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 


logo