శనివారం 11 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 07:45:49

11వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

11వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఢిల్లీ: దేశంలో 11వ రోజు చమురు ధరలు పెరిగాయి. బుధవారం పెట్రోల్‌ లీటర్‌ ధర 55 పైసలు, డీజిల్‌ 69 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గడిచిన 11రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.6.02 పైసలు, డీజిల్‌ పై రూ 6.49 ధర పెరిగింది.  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.77.28, డీజిల్‌ ధర రూ.75.79కు చేరుకొంది. వరుసగా ధరల పెరుగుదలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


logo