మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 08:21:59

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఐదు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ఇన్‌ఫ్లో.. ఐదు గేట్లు ఎత్తివేత

నాగర్‌ కర్నూల్‌ :  శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి లక్షా 98 వేల క్యూసెక్కులకుపైగా  ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో  అధికారులు ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు లక్షా 42 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులు (214.84 టీఎంసీలు)గా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. విద్యుత్‌ ఉత్పత్పి కేంద్రం ద్వారా 31 వేల క్యూసెక్కులు వస్తోంది. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.60 అడుగులు (305.14) టీఎంసీల నీరుంది. ఎడమ కాల్వ, జల విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 23 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo