బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 02:01:17

సూక్ష్మఎవుసం.. దిగుబడి అధికం

సూక్ష్మఎవుసం.. దిగుబడి అధికం

రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సూక్ష్మసేద్యంలో సాగువిస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో దిగుబడులు కూడా ఆశించినదానికన్నా అధికంగా ఉన్నాయి. సమృద్ధిగా లభ్యమవుతున్న సాగునీటి వసతి, రైతుబంధు వంటి పథకాల తోడ్పాటుతో రైతులు ఉత్సాహంగా పంటలు పండిస్తున్నారు.

  • పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి
  • 2018-19లో 1.6 కోట్ల టన్నుల ఉత్పత్తి..
  • సూక్ష్యసేద్యంతో పెరుగుతున్న దిగుబడి
  • ఆరేండ్లలో 2.48 లక్షల మంది రైతులకు డ్రిప్‌, స్ప్రింకర్ల సదుపాయం
  • సామాజిక -ఆర్థిక సర్వే 2020 నివేదిక వెల్లడి
  • స్ప్రింక్లర్లు 1,90,349
  • డ్రిప్‌ కనెక్షన్లు 4,69,894
  • గత ఆరేండ్లలో సదుపాయం పొందిన రైతులు 2,48,742

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సూక్ష్మసేద్యంలో సాగువిస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో దిగుబడులు కూడా ఆశించినదానికన్నా అధికంగా ఉన్నాయి. సమృద్ధిగా లభ్యమవుతున్న సాగునీటి వసతి, రైతుబంధు వంటి పథకాల తోడ్పాటుతో రైతులు ఉత్సాహంగా పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే-2020 నివేదిక ప్రకారం 2018-19 (వానకాలం, యాసంగి) సీజన్లలో 1.6 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో వరి 66.69 లక్షల టన్నులుండగా, మక్కజొన్నలు 20.83 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. ఇక 2019-20లో ఆహారధాన్యాల ఉత్పత్తి 40.17 శాతం పెరిగింది. ధాన్యం ఉత్పత్తి  32 లక్షల టన్నులు పెరిగి 98.74 లక్షల టన్నులు ఉత్పత్తయింది. అదేవిధంగా పత్తి వంటి ఆహారేతర పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. ఆహారేతర పంటల ఉత్పత్తి 2016-17లో 33.6 శాతం ఉండగా, 2018-19 నాటికి 38.8 శాతానికి చేరింది.


వేగంగా పెరుగుతున్న సూక్ష్మసేద్యం

తెలంగాణ ఏర్పడిననాటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరినాటికి రాష్ట్రంలో 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని అమలుచేస్తున్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సూక్ష్మసేద్యం వేగంగా విస్తరిస్తున్నది. రాష్ట్రంలో సుమారు 56 లక్షల మంది రైతులుండగా, గత ఆరేండ్లలో 2.48 లక్షల మంది డ్రిప్‌ సదుపాయం పొందారని సామాజిక-ఆర్థిక నివేదిక తెలిపింది. సూక్ష్మసేద్యం వల్ల రైతులకు ఖర్చు కూడా భారీగా తగ్గిందని నాబ్కాన్స్‌ సర్వే సైతం వెల్లడించింది. నాబార్డు నుంచి రుణం తీసుకొని అమలుచేస్తున్న ఈ పథకంలో దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీలో సూక్ష్మసేద్యంలో వందశాతం సబ్సిడీ ఇస్తున్నారు. సూక్ష్మసేద్యం ద్వారా మరింతమంది రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో కేసీఆర్‌ సర్కార్‌ ఈసారి బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించింది. 


గత ఆరేండ్లలో డ్రిప్‌ కనెక్షన్లు, స్ప్రింకర్ల సదుపాయం పొందిన రైతుల వివరాలు ఇలా ఉన్నాయి


సంవత్సరం  
రైతులు
డ్రిప్‌ కనెక్షన్లు
స్ప్రింక్లర్లు
మొత్తం
2014-15  
31,277
46,353
30,130
74,483
2015-16
39,545
77,979
21,665
99,643
2016-17
55,121
1,32,121
22,835
1,54,956
2017-18
83,458
1,39,289
84,276
2,23,565
2018-19
37,596
70,233
30,530
1,00,763
2019-20
1,745
3,920
913
4,833logo
>>>>>>