గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Sep 18, 2020 , 10:42:01

జూరాల జలాశయానికి పెరిగిన వరద

జూరాల జలాశయానికి పెరిగిన వరద

జోగులాంబ గద్వాల : గత నాలుగురోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద రాక పెరిగింది. శుక్రవారం ఉదయానికి లక్షా 18 క్యూసెక్కులకు పైగా  ఇన్‌ఫ్లో వస్తుండటం.. వరద మరింత పెరిగే అవకాశ ఉండటంతో అధికారులు ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి  లక్షా 21 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు (9.657) టీఎంసీలు కాగా ప్రస్తుతం 1044 అడుగులు (8.810 టీఎంసీలు)గా ఉంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.