శనివారం 29 ఫిబ్రవరి 2020
ఉపాధిహామి కూలీలకు వేసవి భత్యం పెంపు..

ఉపాధిహామి కూలీలకు వేసవి భత్యం పెంపు..

Feb 15, 2020 , 06:34:04
PRINT
ఉపాధిహామి కూలీలకు వేసవి భత్యం పెంపు..

హైదరాబాద్‌: వేసవికాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చేపట్టే పనులు చేసే కూలీలకు సాధారణ పనులకు కల్పించే వేతనం కంటే 20 నుంచి 30 శాతం అధికంగా చెల్లించేందుకు సర్కార్‌ నిర్ణయించింది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా ప్రభుత్వం కరువుభత్యం చెల్లించనుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పనిగంటలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 


logo