గురువారం 09 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 16:43:44

కరోనా టెస్టుల సంఖ్య పెంచండి : అక్బరుద్దీన్‌ ఓవైసీ

కరోనా టెస్టుల సంఖ్య పెంచండి : అక్బరుద్దీన్‌ ఓవైసీ

హైదరబాద్‌ : హైదరాబాద్‌లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, టెస్టులు చేయకుండా కరోనా మీద పోరాటం చేయలేమని ఏఐఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఇటల రాజేందర్‌కు ఈమేరకు లేఖ రాశారు.  హైదరాబాద్‌ పరిధిలో సుమారు 20 వేల టెస్టులైనా చేయాలని, ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే 2వేల కరోనా టెస్టులు చేయాలని కోరారు. చార్మినార్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. వీలైనంత త్వరగా కరోనా టెస్టుల సంఖ్యను పెంచితే వ్యాధి వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 


logo