ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 13:26:22

హరితహారంతో కరీంనగర్ పచ్చబడాలి

హరితహారంతో కరీంనగర్ పచ్చబడాలి

కరీంనగర్ : జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హరితహారంపై  కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. కాంక్రీట్ జంగల్ గా ఉన్న నగరాన్ని హరితవనంగా మార్చాలన్నారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.

హరితహారానికి నిధుల కొరత లేదన్నారు. అవసరమైతే పట్టణ ప్రగతి నిధులతో పాటు ఎల్ఆర్ఎస్, డీఎంఎఫ్టీ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలు నాటాలి. నాటిన మొక్కల్లో 85 శాతం బ్రతికే విధంగా అధికారులు ,ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లా సరి హద్దుల నుంచి జిల్లా కేంద్రం వరకు ఆర్అండ్ బీ రోడ్లకు ఇరువైపులా 3 వరుసలు చెట్లు నాటి, వాటిని సంరక్షించాలన్నారు. గతంలో మాదిరిగా మొక్కుబడిగా చేయకూడదు. నాటిన ప్రతి మొక్క బ్రతకాలన్నారు.

జిల్లాలో ఎస్సారెస్పీ, ప్రభుత్వ స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఉపయోగకరమైన మొక్కలు నాటే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, కమిషనర్ క్రాంతి, డీఎఫ్ వో ఆశ జిల్లా అధికారులు పాల్గొన్నారు.


logo