బీభత్స సునామీకి 16 ఏండ్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం సునామీగా మారి తీర దేశాల్ని అతలాకుతలం చేసిన ఘటనకు పదహారేండ్లు. 2004 డిసెంబర్ 26న భారత్‌తో పాటు హిందూ మహాసముద్రం వెంట ఉన్న అన్ని దేశాలు ప్రకృతి విపత్తు బారినపడ్డాయి. ఆ సంఘటన తర్వాత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం 2007లో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్( ఇన్కాయిస్) ఆధ్వర్యంలో ముందస్తు హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటినుంచి ఇవి సునామీలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయడంతోపాటు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రంలో సునామీ జెనిక్, భూ కంపాలను గుర్తించడానికి రియల్‌టైమ్ భూకంప పర్యవేక్షణ నెట్వర్క్, సునామీ తరంగాలను పర్యవేక్షించడానికి సునామీ బోయీలు, టైడ్గేజ్తో 24X7 కార్యాచరణతో సునామీ ప్రయాణ సమయం, తరంగ ఎత్తును అంచనా వేస్తున్నది. ఈ హెచ్చరికల కేంద్రం 2011 నుంచి హిందూ మహా సముద్ర పరివాహంలోనున్న 25 దేశాలతో సమన్వయం చేసుకుంటున్నది. 2018లో సుంద స్ట్రెయిట్ సునామీ, టర్కీ, గ్రీస్‌లో ఈ ఏడాది అక్టోబర్‌లో వచ్చిన సునామీల సమాచారం ఇచ్చి అందరినీ అలర్ట్‌చేసింది. సవాళ్లను అధిగమించడం కోసం హాని కలిగించే తీర ప్రాంతాల 3 డీ మ్యాపింగ్ వంటి అధునాతన విధానాల వైపు ఇన్కాయిస్ తన దృష్టిని కేంద్రీకరించింది. సునామీలు వస్తే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఏజెన్సీలు, తీర ప్రాంత సంస్థలతో కలిసి వర్క్‌షాపులు, శిక్షణ సమావేశాలు, కమ్యూనికేషన్ పరీక్షలు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు ఇన్కాయిస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- భారత్‌కు బ్రిటన్ ప్రధాని శుభాకాంక్షలు
- కనకరాజును సన్మానించిన జడ్పీచైర్‌పర్సన్, ఎమ్మెల్యేలు
- ఉద్రిక్తంగా కిసాన్ పరేడ్.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
- తేజస్వీ అందాల ఆరబోత.. వైరల్‌గా మారిన పిక్
- పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- రాజ్‌పథ్‌లో మెరిసిన కెప్టెన్ ప్రీతీ చౌదరీ..
- రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా లఢఖ్ శకటం
- టీ-90 భీష్మ.. బ్రహ్మోస్ లాంచర్..పినాకా రాకెట్
- పద్మశ్రీ కనకరాజుకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
- రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల