శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 17:57:24

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరికలు

ములుగు : టీఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని మహాదేవపూర్ మండలం ఫల్గుల గ్రామ సర్పంచ్ మానెం లక్ష్మయ్య, సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా జెట్పీ చైర్మన్ మధుకర్ మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసే పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తుంపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకుడు జక్కు రాకేష్, తదితరులు పాల్గొన్నారు.