Telangana
- Nov 27, 2020 , 16:04:23
భారీగా టీఆర్ఎస్లో చేరికలు

హైదరాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు ఆ బస్తీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అభిమానులున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు బస్తీలో మార్పును తీసుకొచ్చాయి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల నిరసనగా రాజ్నగర్ వాసులు తమ పంథాను ఒక్కసారిగా మార్చుకున్నారు.
బీజేపీతో పాటు కాంగ్రెస్కు అండగా ఉన్న బస్తీవాసులంతా ఏకమై బోరబండ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి బాబా ఫసియుద్దీన్ను ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ బాబా ఫసియుద్దీన్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం జరుగనున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో కారు గుర్తుకు ఓటేసి బాబా ఫసియుద్దీన్ విజయానికి సహకరిస్తామని బస్తీవాసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- క్రీడలతోనే మానసిక ఉల్లాసం
- నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
- ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల పంజా
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
MOST READ
TRENDING