గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 12, 2020 , 12:59:26

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరిక

అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ లో చేరిక

జగిత్యాల : టీఆర్ఎస్ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీ కి చెందిన పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు  కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్  గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తొమ్మిదో వార్డు నుంచి కొంపల పద్మ, ఐదో వార్డు నుంచి తరాల కార్తిక్ తమ అనుచరులతో పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo