మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 15:14:09

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సత్యనారాయణపురంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అన్నారం నుంచి మర్రి గూడెం వయా వేపలగడ్డ వరకు రూ. కోటి తో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 పీడబ్ల్యూ రోడ్డు నుంచి ధర్మపురం వరకు రూ.6.48 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన. ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద రూ. 11.60 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్, ఇల్లందు పట్టణంలోని మెయిన్ రోడ్ బుగ్గవాగు వద్ద రూ. 11.60 లక్షలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ను ప్రారంభించారు.


ఇల్లందులోని సత్యనారాయణపురం రామాలయం వద్ద రూ.22.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇల్లందు పట్టణంలో జగదాంబ సెంటర్ నుంచి  మెయిన్ రోడ్డు, బుగ్గవాగు వయా సురేష్ టెక్స్ట్ టైల్స్ వరకు రూ.1.65కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.logo