శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:38:08

ఎన్‌-రైప్‌ స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ఎన్‌-రైప్‌ స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ పట్టణం, రామయ్య బౌలిలో గల రైతు బజార్‌లో ఎన్‌-రైప్‌ స్టాల్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మామిడిపండ్లను సహజ పద్దతుల్లో మాగబెట్టేందుకు ఈ ఎన్‌-రైప్‌ పౌడర్‌ను వాడుతారన్నారు. హెయిటెన్ ఇన్నోవేటీవ్‌ సొల్యూషన్స్‌ స్టార్టప్‌ కంపెనీ దీన్ని అభివృద్ధి చేసిందన్నారు. మామిడిపండ్లను కాల్షియం కార్భైడ్‌తో మాగబెట్టకుండా దీన్ని స్థానంలో ఎన్‌-రైప్‌ను వాడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతకుక్రితం మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన ఫ్లెరెన్స్‌ నౌటింగేల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు.  
logo