సోమవారం 01 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:04:33

108లో కవలలు జననం..తల్లీబిడ్డలు క్షేమం

108లో కవలలు జననం..తల్లీబిడ్డలు క్షేమం


మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం సింగారం గ్రామానికి చెందిన బుర్ర కుమారి నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో ఆమెను తల్లిదండ్రులు బయ్యారం పీహెచ్‌సీ కి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా  వాహనంలోనే కవలలకు ( పాప, బాబు) జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. సకాలంలో వైద్యం అందించి సుఖ ప్రసవం జరిగేలా చేసిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు.


logo