e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home తెలంగాణ టీఎన్జీవోల కృతజ్ఞతల సభలు

టీఎన్జీవోల కృతజ్ఞతల సభలు

  • పీఆర్సీ అమలుకు కృతజ్ఞతగా నిర్వహణ
  • మొదటి సభ కరీంనగర్‌లో ఏర్పాటు
  • కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తోపాటు ఇతర ప్రయోజనాలు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా రాష్ట్రవ్యాప్తంగా ‘కృతజ్ఞత సభలు’ నిర్వహించనున్నట్టు టీఎన్జీవో ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు జరుగుతాయని, మొదటి సభ కరీంనగర్‌లో నిర్వహిస్తామని తెలిపింది. టీఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో జరిగింది. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 120 మంది కేంద్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనేక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. నూతన పీఆర్సీతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రయోజనం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు 33 జిల్లాల్లో సభలు నిర్వహించాలని తీర్మానించారు. ఈహెచ్‌ఎస్‌ పథకాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను భాగ్యనగర్‌ టీఎన్జీవోలకు కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోలా రాజేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎం సత్యనారాయణ గౌడ్‌, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌ శ్యామ్‌సుందర్‌, ఎన్‌ఎన్‌ స్వామి, చేపూరి నర్సింహాచారి, ఉమాదేవి, నజీర్‌ అహ్మద్‌, ఎంబీ నరేందర్‌, ఏ తిరుమల్‌ రెడ్డి, వీ రవి, వీ మాధవి, జీ చంద్రశేఖర్‌, కే రమేశ్‌, ఈ కొండల్‌ రెడ్డి, కే జగదీశ్వర్‌, కే శ్రీనివాస్‌, వీ సిద్దిరామ్‌, టీ శైలజ, వీ రాఘవేందర్‌రావు, సంతోష్‌ , టీ ఈశ్వర్‌, సారంగపాణి, శ్రీనివాస్‌, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయం నగరశాఖ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana