ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 14:09:11

ఉద్యమ స్ఫూర్తితో పారిశుధ్య పనులు చేపట్టాలి

ఉద్యమ స్ఫూర్తితో పారిశుధ్య పనులు చేపట్టాలి

వరంగల్ రూరల్ : ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాలు కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేప‌ట్టాలని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ప‌ది గంట‌ల‌కు ప‌ది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని త‌న నివాసంలో మంత్రి సతీమణి ఉషతో క‌లిసి పారిశుద్ధ్య ప‌నులు చేపట్టారు. ఇంట్లో చెట్ల పాదుల్లోని చెత్తను ఏరివేశారు. నీటి నిలువ‌లు లేకుండా చేశారు.

చెత్తా చెదారం తీసేసి దోమ‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ఆదివారం ప‌ది గంట‌ల‌కు, ప‌ది నిమిషాల కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేప‌ట్టాలన్నారు. దోమ‌ల నివార‌ణ‌తో మ‌లేరియా, డెంగీ వంటి అనేక  సీజనల్ వ్యాధులు రాకుండా నివారించవచ్చని ఆయన తెలిపారు. ఇంటితోపాటు, ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని రోగ ర‌హితంగా మార్చవచ్చన్నారు. 


logo