శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 19:43:35

‘ఓఆర్‌ఆర్‌’పై అత్యవసర సమయంలో ఈ నంబర్‌కు డయల్‌ చేయండి

‘ఓఆర్‌ఆర్‌’పై అత్యవసర సమయంలో ఈ నంబర్‌కు డయల్‌ చేయండి

హైదరాబాద్‌ :  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ఏ ప్రమాదం జరిగినా 1066 నంబర్‌కు కాల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేందుకు పది అత్యాధునిక అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 10 ట్రామా కేర్ సెంటర్లు 24 గంటల పాటు పనిచేస్తాయని అర్బన్ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాన్ని గుర్తించిన ఎవరైనా బాధితుల వైద్య సహాయానికి ఈ నంబర్‌కు కాల్‌ చేసి జీవితాలను రక్షించాలని కోరారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.