బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 01:57:52

పరిశ్రమ.. ఉపాధి ధీమా

పరిశ్రమ.. ఉపాధి ధీమా
  • జాతీయ సగటు కంటే అధిక అవకాశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పారిశ్రామికరంగం జాతీయ సగటు కంటే గణమైన వృద్ధిరేటును సాధించింది. 2014-17 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు 6% ఉండగా, జాతీయ సగటు 3.6 శాతమే నమోదైంది. రాష్ట్రంలో 2009-10లో 7,729 పరిశ్రమలు వస్తే.. 2016-17 లో 12, 476 పరిశ్రమలొచ్చాయని, ఇది గతంలో కంటే 61% అధికమని సామాజిక ఆర్థికసర్వే పేర్కొన్నది. ఉత్పత్తి విలువ భారీగా పెరిగిందని, 2015 -16లో రూ.2,03,547 కోట్లు ఉండగా, అది 2016-17కు  రూ.2,24,348 కోట్లకు చేరిందని తెలిపింది. ఏడాదిలోనే 10.22 శాతం పెరిగినట్టు వెల్లడించింది. ఉత్పత్తి యూనిట్ల గ్రాస్‌ వాల్యూయాడెడ్‌ 13.9 శాతం పెరుగగా, అదే సమయంలో జాతీయసగటు 8.3 శాతం మాత్రమే ఉన్నదని పేర్కొన్నది. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో వెచ్చించిన ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌.. 14.4 శాతం ఉండగా, జాతీయ సగటు 13.5 శాతమేనని సర్వే వెల్లడించింది. 
logo
>>>>>>