శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 02:00:58

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

  • ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్‌: గ్రామాలాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌లో పలు అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను మంత్రి పంపిణీ చేశారు.logo