ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 12:31:14

ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు

ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు

భద్రాచలం: జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖానను రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం సందర్శించారు. హాస్పిటల్ వసతులు, నిర్వహణ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో మెరుగయిన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియ దవాఖానలో ఆరోగ్య శ్రీ సేవలకు డాక్టర్లు ఉన్నారని తెలిపారు.  

అలాగే ఐసీయూ లో కేవలం 2 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని, రానున్న కొద్దిరోజుల్లో ఇంకా ఏర్పాటు చేస్తానని అయన హామీ ఇచ్చారు. ఈ కరోన కష్టకాలంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే దగ్గర లో ఉన్న పీహెచ్ సీని సంప్రదించాలన్నారు. అంతేగాని ప్రైవేటు దవాఖానలకు వెళ్లి మోసపోవద్దు అని అయన సూచించారు.logo