శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 01:52:40

దవాఖానకు మెరుగైనవసతులు

దవాఖానకు మెరుగైనవసతులు

  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • జిల్లా దవాఖాన తనిఖీ.. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వనపర్తి: వనపర్తి జిల్లా దవాఖానకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో  సీఎం సహాయనిధి  చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా దవాఖానను తనిఖీ చేశారు. కరోనా విపత్తులో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. దవాఖానలో వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ప్రధానంగా జిల్లాకు నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. దసరా నాటికి రైతు వేదిక భవనాలను పూర్తి చేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లాకు  అదనంగా మరో 1500 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తర్వాత ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో సీసీ రోడ్లు, మున్నూరు కాపు భవన అదనపు గదులకు మంత్రి భూమి పూజ చేశారు. జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌లు వేణుగోపాల్‌,  శ్రీవాస్తవ, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 


logo