శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:50:28

యాదాద్రిలో ఆకట్టుకునేలా సాలహారాలు

యాదాద్రిలో ఆకట్టుకునేలా సాలహారాలు

  • ‘నారసింహుడి’ రూపాల ఏర్పాటు
  • చినజీయర్‌స్వామితో చర్చలు

యాదాద్రి, నమస్తేతెలంగాణ: యాదాద్రిలో పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయ సాలహారాల ఏర్పాటుతోపాటు ఆలయ అభివృద్ధి పనుల పై సోమవారం ఆలయ ఈవో గీత, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి చినజీయర్‌స్వామితో చర్చించారు. హైదరాబాద్‌లోని ఆశ్రమంలో ఆయన్ను కలిసి ఆలయ ప్రాకార మంటపాల్లోని సాలహారాల్లో నరసింహుడి వివిధ అలంకార, బ్రహ్మోత్సవ రూపాలు, దశావతారాల విగ్రహాలు, అష్టలక్ష్మి, శ్రీకృష్ణుడి రూపాల అందమైన విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ తుదిదశ పనులు, రథమంటపం, వివిధ విగ్రహాల ఏర్పాటు పనులపై చినజీయర్‌స్వామితో చర్చించారు. కాగా ఆలయంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐరావతం, సింహం, లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు సోమవారం మహాబలిపురం నుంచి కంటైనర్లలో ఆలయానికి చేరుకున్నాయి. 

యాదాద్రిలో దర్శనాలు నిలిపివేత! 

యాదాద్రిలో కరోనా విజృంభిస్తుండటంతో వారంపాటు దర్శనాలు నిలిపివేయాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దేవాదాశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని సోమవారం కోరారు. కాగా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు.  


logo