శనివారం 04 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 17:45:54

ఖమ్మంలో ఆకట్టుకుంటున్న 40 అడుగుల పీవీ సింధు వాల్‌ ఆర్ట్‌

ఖమ్మంలో ఆకట్టుకుంటున్న 40 అడుగుల పీవీ సింధు వాల్‌ ఆర్ట్‌

ఖమ్మం : ఖమ్మం పట్టణానికి చెందిన యువత స్వాతి, విజయ్‌ గోడల మీద ఆర్ట్‌లు వేస్తూ తమ అభిరుచిని చాటుతున్నారు. ఈ మధ్య వాళ్లు ఖమ్మంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియం గోడపై బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు 40 అడుగుల పెయింటింగ్‌ను వేశారు. దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో స్పందించిన పీవీ సింధు వారిని అభినందించింది. ఆర్ట్‌ను తాను కూడా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ దానికి ఆర్ట్‌ వేస్తున్న యూట్యూబ్‌ వీడియో లింక్‌ను జత చేసింది. దీంతో నెటిజన్లు లైకులు, కామెంట్లు చేస్తూ స్వాతి, విజయ్‌లను అభినందిస్తున్నారు. 
logo