సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 18:55:10

దీపావళి నాడు నువ్వుల నూనెతో తలంటు స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

దీపావళి నాడు నువ్వుల నూనెతో తలంటు స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?

దీపావళి అనగానే చిన్నా పెద్ద అందరూ సంతోషంగా చేసుకునే పండుగ అని తెలుసు. అయితే ఈరోజున ఉదయం పూట ఏం చేయాలి? దీనివెనుక ఉన్న పరమార్థం తెలుసుకుందాం.. 

‘’తైలే లక్ష్మీ ర్దలే గంగా దీపావళి తిధౌ వసేత్

అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే|| ‘’

దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి ( దారిద్య్రం ) తొలగుటకు తలకు నువ్వుల నూనె రాసుకుని తలంటుకొని స్నానం చేయాలి. దీనివల్ల గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు నివారణకై ఇది సులభమార్గం అని పెద్దలు చెప్పారు.  ( చదవండి : దీపావళి విశిష్టతలు ఇవే ! )

‘వెలుగు దివ్వెల పండుగ’ వెనుక ఉన్న కథ ఇదే వీడియో ..