మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 12:46:03

కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు : మంత్రి పువ్వాడ

కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు అయిన చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడిఎస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఖమ్మం నియోజకవరం నుంచి వివిధ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న రోగులకు సీఎంఆర్ ఎఫ్ నుంచి నిధులు మంజూరయయ్యాయి. రూ.30,27,500 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పేదలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా కరోనా పేషంట్స్ కి చికిత్సను అందిస్తూ ప్రజలను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ,ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న పేద వారికి సీఎం ఆర్ ఎఫ్(CMRF) పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వివరించారు.   కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,  టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ , కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.


logo