బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 17:33:33

క్లిష్ట పరిస్థితిల్లోనూ సంక్షేమ పథకాల అమలు

క్లిష్ట పరిస్థితిల్లోనూ సంక్షేమ పథకాల అమలు

వరంగల్ అర్బన్ : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల దల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం హన్మకొండ మండల పరిధిలోని డివిజన్ లకు  చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను అంబేద్కర్ భవన్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని  సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు. 

అలాగే వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలో కరోనా నిర్ధారణ  పరీక్షలు చేస్తున్నార న్నారు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారికి ప్రభుత్వం వసతి, వైద్యం ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, వీరగంటి రవీందర్, బోడ డిన్నా, రంజిత్ రావు,సుధాకర్ రావు, నయీమ్, తహసిల్దార్ కిరణ్ , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


logo