సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 20:19:10

ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వ పథకాల అమలు : మంత్రి పువ్వాడ

ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వ పథకాల అమలు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : కరోనా పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ పథకాల విస్తరణకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పండ్రేగుపల్లిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఖానాపురంలో రూ.9 లక్షలతో పలు వీధుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo