గురువారం 04 జూన్ 2020
Telangana - May 11, 2020 , 01:31:44

బత్తాయిలతో రోగ నిరోధక శక్తి

బత్తాయిలతో రోగ నిరోధక శక్తి

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు బత్తాయి పండ్లు ఎంతో ఉపయోగపడతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపు మేరకు ఆదివారం కరీంనగర్‌లో బత్తాయి దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ వద్ద డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ ఆధ్వర్యంలో మంత్రి బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఆరోగ్యంతోపాటు మనోధైర్యం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు.logo