సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 02:14:05

సహజయోగాతో రోగనిరోధక శక్తి నేడు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

సహజయోగాతో రోగనిరోధక శక్తి నేడు యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం

  • ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12 వరకు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్‌: సహజ యోగా ద్వారా తమలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని మానసిక, శారీరక సమతుల్యతను సాధించవచ్చునని సహజయోగా ట్రస్ట్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌రెడ్డి తెలిపా రు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 16 భాషల్లో ఆన్‌లైన్‌ వేదికగా ఆదివారం ఉదయం 9నుంచి రాత్రి 9వరకు  ప్రపంచవ్యాప్త ఆన్‌లైన్‌ ధ్యాన యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్‌ సభ్యులు వీవీరావు, వీరారెడ్డి, సునీల్‌అగ్వార్‌, లక్ష్మణ్‌రావు, డాక్టర్‌ రాకేశ్‌ యోగా శిబిరం బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సహజయోగా ట్రస్ట్‌ ద్వారా 140 దేశాల్లో లక్షల మందికి యోగా, ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించామని చెప్పారు. ఆదివారం ఉదయం జరిగే కార్యక్రమంతోపాటు ఔత్సాహికుల కోసం 14 రోజులపాటు ఆన్‌లైన్‌ శిబిరాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఉదయం 11:15నుంచి మధ్యాహ్నం 12వరకు తెలుగులో, రాత్రి 7 నుంచి 8 వరకు ఇంగ్లిష్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందన్నారు. www. sahajayogatelangana. org/live, www. sahajayoga. org.in లింక్‌ ద్వారా లేదా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన క్యూఆర్‌ కోడ్‌ ద్వారా వీక్షించవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8106223451, 97005 13520, 9490547888 నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.