శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:29

బాధితుడికి కవిత అండ ట్విట్టర్‌లో విన్నపానికి వెంటనే స్పందన

బాధితుడికి కవిత అండ ట్విట్టర్‌లో విన్నపానికి వెంటనే స్పందన

జనగామ: ఆపదలో ఉన్నాం.. ఆదుకోవాలని కోరిన వెంటనే బాధిత కుటుంబానికి అండగా నిలిచారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జనగామ జిల్లా నర్మెట మండలం మచ్చుపహాడ్‌కు చెందిన మురారినాయక్‌ కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉండడంతో తన పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారని కవితకు ట్విట్టర్‌లో పోస్ట్‌చేశాడు. వెంటనే స్పందించిన ఆమె జనగామ జిల్లా జాగృతి అధ్యక్షుడు పసునూరి మురళికి ఫోన్‌చేసి మురారి కుటుంబానికి సాయం చేయాలని సూచించా రు.మురళి బుధవారం బాధితుడికి బియ్యం,నిత్యవసరాలు అందజేశారు. 


logo