మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 19:26:57

ఐఎండీ హెచ్చరిక.. తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

ఐఎండీ హెచ్చరిక.. తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం పశ్చిమ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, రాబోయే రెండు మూడు రోజుల్లో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో ఆగస్టు 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు పడనున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి, కృష్ణా నదులకు వరద పోటుత్తుతోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo