మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 14:43:50

అక్రమంగా విక్రయిస్తున్న విత్తనాల సీజ్

అక్రమంగా విక్రయిస్తున్న విత్తనాల సీజ్

పెద్దపల్లి : నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ విక్రయదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని జగన్నాధపురంలో సిరిశెట్టి సదానందం తన నివాసంలో అనధికారికంగా వరి వంగడాలను విత్తనాలుగా ప్యాకింగ్ చేసి.. అమ్మేందుకు సిద్ధంగా ఉన్న 2,274 బ్యాగులను వ్యవసాయ అధికారి అలివేణి, టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ రూ.9 లక్షల 38, 400  ఉంటుందని తెలిపారు. ఒక్కొక్క బ్యాగులో 20 కిలోల వంగడాలు ఉన్నాయి. ఎవరైనా అనుమతులు లేకుండా ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


logo