‘అలివి’తో విలవిల

- కృష్ణాతీరాన రాకాసి వలలతో అక్రమంగా వేట
అది సాగర తీరంలో దాగుడు మూతల ఆట.. ఇందులో ఒకరిది కాసుల వేట అయితే మరొకరిది బతుకు వేట. అలివి వలలతో వేట మాటున సాగుతున్న ఈ దోబూచులాటలో దళారులు కుబేరులైతే.. మత్స్యకారులు మాత్రం విధివంచితులై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
- దేవరకొండ
చిన్నస్థాయి మత్స్యకారుల ఉపాధికి దెబ్బ
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్.. అపార జలరాశులకు నిలయం. సాగర తీరంలో లభించే బొచ్చ, రవ్వ, జెల్ల, జిలాబీలు, పాంప్లేట్లు, మోషులు, గడ్డి జెల్లలు, బొమ్మిడాలు, రేగు జెల్లలు, కొదిర్లు, వాలుగలు, పరకలు వంటి పలు రకాల చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, ఒడిశా తదితర ప్రాంతాలకు ఇక్కడి చేపలు ఎగుమతి అవుతున్నాయి. వేట కొనసాగే రోజుల్లో నిత్యం 3 నుంచి 5 టన్నుల చేపలు ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాయి. నిత్యం టన్నుల కొద్దీ చేపలను ఎగుమతి చే యాల్సి వస్తుండటంతో దళారులు అలివి వలలను ఉపయోగిస్తున్నారు. అలివి వలలను ప్రభుత్వం నిషేధించినా కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాటిని వినియోగిస్తున్నారు. వాటితో చిన్న చేపలను సైతం వేటాడుతున్నారు. వైజాగ్ కాలనీలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మత్స్యకారులకు అప్పులు ఇచ్చి దళారి వ్యవస్థకు తెర తీస్తున్నారు. దళారులు చిన్న, సన్నకారు మత్స్య కారులకు, గిరిజనులకు అలివి వలలు ఇచ్చి చేపలను వేటాడిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారి మధ్యే చిచ్చు పెడుతున్నారు.
మా కష్టమంతా దళారుల పాలు
సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా అవి మాలాంటోళ్లకు అందడం లేదు. ఉపాధి కల్పించేందుకు చేప పిల్లలను వదిలినా అలివి వలల కారణంగా మేం వేసిన వలలకు చేపలు పడటం లేదు. మా కష్టమంతా దళారుల పాలవుతున్నది. ఎండ్లు గడుస్తున్నా మా జీవితాలు మారడంలేదు.
- గంగమ్మ, వైజాగ్ కాలనీ
వలలపై అవగాహన కల్పిస్తున్నాం
సాగర తీరంలో అలివి వలలపై నిషేధం ఉన్న ది. దీనిపై గతంలోనే మత్స్యకారులకు అవగాహన కల్పించాం. అయినా కొందరు ఆ వలలను వాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలివి వలలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- మారయ్య, మత్స్య శాఖ
డివిజన్ అధికారి, దేవరకొండ
తాజావార్తలు
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు
- పోర్ట్ ప్రాజెక్టుల కోసం ఆరు లక్షల కోట్లు పెట్టుబడి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు