శనివారం 04 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 11:28:47

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత


ఆదిలాబాద్ : జిల్లాలో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బోథ్ మండలం గన్ పూర్, మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ ఆటోలో 4,412 బాటిళ్లను కుమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన సునిల్, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు తీసుకువస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.2 లక్షల 32 వేల ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వీరితో పాటు  అక్రమ రవాణా లో మరో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. నిందితులను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.


logo